NTV Telugu Site icon

Khushi kapoor: చెల్లి కూడా నందమూరి హీరోతోనే టాలీవుడ్ ఎంట్రీ?

Khushi Kapoor News

Khushi Kapoor News

Khushi kapoor Tollywood Debut with Mokshagna – Prasanth Varma Movie: నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6న నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు నందమూరి నాలుగో తరం నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు అనే ఊహాగానాలు ఉన్నాయి. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాను 6న పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నారని, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని అంటున్నారు. నిజానికి నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైనప్పటి నుండి మీడియాలో రకరకాల ఊహాగానాలు, కథనాలు వస్తూనే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. ఆయన సినిమా అధికారిక ప్రకటన తేదీ దగ్గర పడుతుండడంతో హీరోయిన్ ఎంపికపై ఊహాగానాలు మొదలయ్యాయి.

Kavya Thapar: హార్డ్ వర్క్ చేసి వెయిట్ తగ్గా.. బోల్డ్ క్యారెక్టర్ చేశా: హీరోయిన్ కావ్య థాపర్ ఇంటర్వ్యూ

దర్శకుడు ప్రశాంత్ వర్మ కథానాయికగా కుషీ కపూర్‌ని ఎంపిక చేయాలని భావించారని అంటున్నారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే దేవర, రామ్ చరణ్ 16 అనే రెండు పెద్ద సినిమాల్లో నటిస్తుండడంతో శ్రీదేవి కూతుళ్ల క్రేజ్ ఎలాంటిదో ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో కుషీ కపూర్‌ని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారనే ప్రచారాలు మొదలయ్యాయి. అయితే అసలు విషయం నిజమేనా? కాదా? అని తెలుసుకునే ప్రయత్నాలు చేయగా మేకర్స్ ఇంకా కుషీ కపూర్‌ని సంప్రదించలేదని తెలిసింది. అసలు సంప్రదించ లేదు అంటే ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే చెప్పాలి. కాబట్టి ఆమె కథ విని, ఆమె తండ్రి బోనీ కపూర్ విని ఫైనల్ చేయాలి. అప్పుడు వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతుంది. అయితే కాంబినేషన్ మాత్రం సాలిడ్ గా ఉండడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Show comments