ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’ అనే సినిమాలో నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా, ఈ సినిమా ఐదు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సినిమా టీమ్ వెల్లడించింది. అయితే, ఇంకా ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ మాత్రం రిలీజ్ చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు టీమ్ తెలిపింది.
Also Read : Kannappa : ట్రోల్స్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం.. కన్నప్ప టీమ్ వార్నింగ్..!
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారాయణ, పుష్కూర్ రామ్మోహనరావు, అజయ్ కైకాల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. అలాగే, నాగార్జున పాత్ర ఎంపిక గురించి కూడా ప్రశంసలు వస్తున్నాయి. సుమారు 181 నిమిషాల నిడివితో తెలుగులో రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, ధనుష్ హోమ్ గ్రౌండ్ అయిన తమిళనాడులో మాత్రం సినిమా ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది.
Also Read : Sridhar Reddy: అమెరికా ఎయిర్ పోర్టులో టాలీవుడ్ నటుడి కొడుకు మిస్సింగ్
మొత్తం మీద, ప్రజలు థియేటర్లకు రావడం లేదేమో అనే చర్చల నేపథ్యంలో, ఈ సినిమా ఐదు రోజుల్లో 100 కోట్ల కలెక్షన్లు సాధించడం మామూలు విషయం కాదు. భవిష్యత్తులో ఇంకెన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ కూడా ఇప్పటికే ఖాయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతోంది.
