Site icon NTV Telugu

Krithi Shetty: హోటల్ రూమ్‌లో ఆత్మను చూశా..షాకింగ్ విషయం బయట పెట్టిన కృతిశెట్టి

Krithi Shetty

Krithi Shetty

ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ వింత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ గదిలో ఒక ఆత్మను చూశానని ఆమె వెల్లడించారు. ఈ అనుభవం ఆమె పాత్రపై నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. కృతి శెట్టి ప్రస్తుతం తమిళ నటుడు కార్తి హీరోగా, నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వా వాత్తియార్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఆత్మలతో మాట్లాడే ఒక జిప్సీ యువతి పాత్రను పోషిస్తున్నారు.

Also Read :AMB Banglore: బెంగళూరులో మహేష్ ఏఎంబి..ఆరోజే ఓపెనింగ్

ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, “ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఒక ఆత్మ రూపాన్ని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి అది మాయమైంది. ఆ ఆత్మ నాకు సహాయం చేయడానికి వచ్చిందో లేక పాత్ర కోసం నేను చేస్తున్న సాధన వల్ల వచ్చిందో తెలియదు” అని కృతి శెట్టి వెల్లడించారు. ఆత్మల పట్ల తనకు మొదటి నుంచీ నమ్మకం ఉందని కృతి పేర్కొన్నారు. “నేను తుళు సంప్రదాయానికి చెందినదాన్ని. మేము మా పూర్వీకులను దేవతలుగా పూజిస్తాం. వారు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉంటారని నమ్ముతాం. ఇప్పుడు ఈ ఘటనతో ఆ నమ్మకం మరింత బలపడింది” అని ఆమె వివరించారు.

Also Read :Galla Madhavi: వినూత్న నిరసన.. రోడ్డుపై ఉన్న గుంతలను స్వయంగా పూడ్చిన ఎమ్మెల్యే..!

ఈ విచిత్ర అనుభవం వల్ల సినిమాలో తాను పోషిస్తున్న పాత్రపై మరింత నమ్మకం కలిగిందని, నటనలో అది తనకు బాగా ఉపయోగపడిందని కృతి శెట్టి తెలిపారు. ‘వా వాత్తియార్’ చిత్రంలో కార్తి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్, కరుణాకరన్ వంటి ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version