Krithi Shetty: హోటల్ రూమ్‌లో ఆత్మను చూశా..షాకింగ్ విషయం బయట పెట్టిన కృతిశెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ వింత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ గదిలో ఒక ఆత్మను చూశానని ఆమె వెల్లడించారు. ఈ అనుభవం ఆమె పాత్రపై నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. కృతి శెట్టి ప్రస్తుతం తమిళ నటుడు కార్తి హీరోగా, నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వా వాత్తియార్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఆత్మలతో మాట్లాడే ఒక జిప్సీ యువతి పాత్రను పోషిస్తున్నారు.
Also Read :AMB Banglore: బెంగళూరులో మహేష్ ఏఎంబి..ఆరోజే ఓపెనింగ్
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, “ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఒక ఆత్మ రూపాన్ని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి అది మాయమైంది. ఆ ఆత్మ నాకు సహాయం చేయడానికి వచ్చిందో లేక పాత్ర కోసం నేను చేస్తున్న సాధన వల్ల వచ్చిందో తెలియదు” అని కృతి శెట్టి వెల్లడించారు. ఆత్మల పట్ల తనకు మొదటి నుంచీ నమ్మకం ఉందని కృతి పేర్కొన్నారు. “నేను తుళు సంప్రదాయానికి చెందినదాన్ని. మేము మా పూర్వీకులను దేవతలుగా పూజిస్తాం. వారు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉంటారని నమ్ముతాం. ఇప్పుడు ఈ ఘటనతో ఆ నమ్మకం మరింత బలపడింది” అని ఆమె వివరించారు.
Also Read :Galla Madhavi: వినూత్న నిరసన.. రోడ్డుపై ఉన్న గుంతలను స్వయంగా పూడ్చిన ఎమ్మెల్యే..!
ఈ విచిత్ర అనుభవం వల్ల సినిమాలో తాను పోషిస్తున్న పాత్రపై మరింత నమ్మకం కలిగిందని, నటనలో అది తనకు బాగా ఉపయోగపడిందని కృతి శెట్టి తెలిపారు. ‘వా వాత్తియార్’ చిత్రంలో కార్తి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్, కరుణాకరన్ వంటి ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!