Krishnamma : “కృష్ణమ్మ” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. అతిధులుగా రానున్న తెలుగు స్టార్ డైరెక్టర్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అద్భుతమైన నటనతో వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’.దాదాపు రెండు సంవత్సరాల తరువాత సత్యదేవ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించారు.ఈ మూవీలో అర్చనా అయ్యర్, అతిరా రాజ్, కృష్ణ బూర్గుల మరియు లక్ష్మణ్ మీసాల ముఖ్య పాత్రలు పోషించారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కృష్ణమ్మ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి. ఈ సినిమా మే 10వ తేదిన విడుదల కానుంది.
ఈక్రమంలో మే 1న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ ఈవెంట్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ట్రైడెంట్ హౌటల్లో మే 1 సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.ఇదిలా ఉంటే కృష్ణమ్మ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా ఐదుగురు తెలుగు స్టార్ డైరెక్టర్లు ముఖ్య అతిథిలుగా రానున్నారు..దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ,సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి మరియు గోపిచంద్ మలినేని కూడా చీఫ్ గెస్టులుగా రానున్నారు. ఒకే వేదికపైకి ఈ ఐదుగురు స్టార్ డైరెక్టర్లు రానున్నారు. దీంతో ప్రేక్షకులలో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై చాలా ఆసక్తి నెలకొని ఉంది.తెలుగు సినిమాలో ఇది గ్రాండెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అని కృష్ణమ్మ మేకర్స్ తాజాగా ట్వీట్ చేశారు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
The stars have aligned for #Krishnamma and so have the blockbuster directors of Telugu Cinema ❤️🔥
Catch them at the GRANDEST PRE-RELEASE EVENT OF TELUGU CINEMA on May 1st ✨
▶️ https://t.co/NCtHoXN3gB pic.twitter.com/DXQVwVw2fT— ArunachalaCOffl (@ArunachalaCOffl) April 29, 2024
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..