NTV Telugu Site icon

Krishna Vamsi: ‘పుష్ప 2’ మూవీ పై ఇన్‌డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

February 7 (19)

February 7 (19)

‘పుష్ప 2’ సినిమా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.సుకుమార్, అల్లు అర్జున్ అనుకున్నది సాధించారు.అయితే ఏ హీరో అయిన, డైరెక్టర్ అయిన ఇలాంటి ఒక భారీ హిట్ కొడితే చాలు.. కనీసం ఇలాంటి ప్రాజెక్ట్‌లో చిన్నపాత్ర చేసిన చాలు అనుకుంటారు. కానీ ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం కోట్లు ఇచ్చిన ఇలాంటి సినిమా మాత్రం చేయను అని కరాకండిగా చెప్తున్నారు.. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే.

Also Read: Siddhu Jonnalagadda: లవర్స్ డే సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మూవీ రీ రిలీజ్..

టాలీవుడ్ లో మంచి ఫ్యామిలీ మూవీస్ తో అలరించే డైరెక్టర్ ఎవరు అంటే కృష్ణ వంశీ అని చెప్పాలి. ఆయన నుండి వచ్చిన ప్రతి ఒక కుటుంబ కథ చిత్రం ఎంతో కలర్ ఫుల్ గా ఉంటాయి. ఇక పోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కృష్ణవంశీ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా ఓ అభిమాని కృష్ణవంశీ హర్రర్ సినిమా చేస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ కు స్పందించిన కృష్ణవంశీ ‘నేను కూడా హార్రర్ సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న’ అంటూ రిప్లై ఇచ్చారు.

ఇంతలోనే మరో అభిమాని, ఓ రాబరీ మూవీ కూడా చేయండి సార్ అంటూ కామెంట్ చేయగా కృష్ణవంశీ స్పందిస్తూ ‘చెడ్డ పనిని గొప్పగా చూపించడం కరెక్ట్ కాదు.ఇలాంటి వాటికి నేను అస్సలు సపోర్ట్ చేయలేను. మనం తీసే సినిమా జనాలో మంచి ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. చెడ్డ పనులను ప్రోత్సహించేలా ఉండకూడదు. ఇలాంటి సినిమాలకు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను చేయను’ అంటూ తెలిపారు. దీంతో కృష్ణవంశీ మాటలకు బన్ని ఫ్యాన్స్ హాట్ అయ్యారు, అతను ఇన్ డైరెక్ట్ గా ‘పుష్ప’ మూవీ గురించి మాట్లాడుతున్నాడు అంటే కామెంట్స్ చేస్తున్నారు. మరి కృష్ణవంశీ మాత్రం ఈ కామెంట్స్ పై స్పందిస్తాడో చూడాలి.