NTV Telugu Site icon

T Series: స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం

Tiisha Kumar Death

Tiisha Kumar Death

Krishan Kumar Daughter Tishaa Kumar Passes Away At 20 : నటుడు-నిర్మాత క్రిషన్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్రిషన్ కుమార్ కుమార్తె తీషా కుమార్ 20 ఏళ్ల వయసులో మరణించారు. టీ-సిరీస్ సీఈవో భూషణ్ కుమార్ బంధువు తీషా జూలై 18న తుది శ్వాస విడిచారు. ఆమె గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, తీషా క్యాన్సర్ చికిత్స జర్మనీలో కొనసాగుతోంది. తీషా తుది శ్వాస విడిచారు. రెండు నెలల తర్వాత తీషా తన 21వ పుట్టినరోజు జరుపుకోబోతోంది, అయితే ఇంతలోన్ ఆమె కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

US President Elections: డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే మాకు ఇబ్బందే- జెలెన్ స్కీ

భారతదేశపు అతిపెద్ద సంగీత లేబుల్, చలనచిత్ర నిర్మాణ సంస్థ T-Series తీషా మృతి సందర్భంగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో, ‘క్రిషన్ కుమార్ కుమార్తె తీషా కుమార్ అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం తర్వాత నిన్న మరణించారు. ఇది మా కుటుంబానికి చాలా కష్టమైన సమయం, కుటుంబ గోప్యతను గౌరవించాలని మా వినయపూర్వకమైన అభ్యర్థన’’ అని పేర్కొన్నారు. ఇక టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ తమ్ముడు నటుడు క్రిషన్ కుమార్‌ అందరికీ సుపరిచితుడు. ఆయన కేవలం 5 సినిమాలో నటించాడు కానీ 1995లో విడుదలైన ‘బేవఫా సనం’ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ సినిమా పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి.

క్రిషన్ కుమార్ తాన్యా సింగ్ కుమార్తె తీషా కుమార్. తాన్య నటి అలాగే గాయని. ఆమె క్రిషన్ కుమార్‌తో కలిసి ‘ఆజా మేరీ జాన్’ (1993) చిత్రంలో నటించింది. 2000ల ప్రారంభంలో, ఆమె పాట ‘వో బీటే దిన్’ చాలా ప్రజాదరణ పొందింది. 6 సెప్టెంబర్ 2003న జన్మించిన తీషా తరచుగా T-సిరీస్ చిత్రాల ప్రీమియర్స్ లో కనిపించేది. ఆమె చివరిగా నవంబర్ 30, 2023న రణబీర్ కపూర్ మరియు రష్మిక మందన్న నటించిన ‘యానిమల్’ చిత్రం స్క్రీనింగ్‌లో కనిపించింది.

Show comments