హాలీవుడ్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది. అందుకు ఒక కారణం ఆ సినిమాల్లో ఉండే హై క్వాలిటి అండ్ క్రియేటివిటి కాగా రెండో కారణం… వివిధ దేశాల ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ హాలీవుడ్ చిత్రాల్లో తమ ప్రతిభని చాటుతుంటారు. ఆ క్రమంలోనే మన నటీనటులు చాలా మంది అమెరికన్ మూవీస్ లో నటించారు. ఈ మధ్య కాలంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, ఇర్ఫాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ లాంటి వారు కూడా హాలీవుడ్ లో భాగమయ్యారు. ఇప్పుడు మన లాంటి ట్రెండే సౌత్ కొరియాలోనూ కొనసాగుతోంది… హాలీవుడ్ లోనే కాక అమెరికన్ ఆడియన్స్ లోనూ గత కొంత కాలంగా సౌత్ కొరియన్ క్రేజ్ పెరుగుతోంది. అందుకు మంచి ఉదాహరణే ఆస్కార్స్ బరిలోనూ కొరియన్ మూవీస్ సత్తా చాటుతుండటం. బీటీఎస్ లాంటి కొరియన్ మ్యూజికల్ బ్యాండ్ యూఎస్ లో దుమారం రేపుతుండటం. ఇక ఇప్పుడు ‘కెప్టెన్ మార్వెల్’ సినిమా సీక్వెల్ లోనూ కొరియన్ కోణం కనిపించబోతోంది. సౌత్ కొరియా సూపర్ స్టార్ పార్క్ సీయో జూన్ ‘కెప్టెన్ మార్వెల్ 2’లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట!
నియా డకోస్టా దర్శకత్వంలో బ్రై లార్సన్ టైటిల్ రోల్ లో ‘కెప్టెన్ మార్వెల్ 2’ రూపొందుతోంది. 2022, నవంబర్ 11న రిలీజ్ డేట్ ప్రకించారు. అయితే, ఈ మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సూపర్ హీరో మూవీలో ఓ ప్రధానమైన పాత్ర సౌత్ కొరియన్ స్టార్ కోసం రాశారట. తన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన క్యారెక్టర్ కోసం పార్క్ సియో జూన్ అమెరికా బయలుదేరాడని కూడా సమాచారం. అయితే, ఆయన తరుఫు నుంచీ ఇంత వరకూ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. కానీ, రానున్న నెలల్లో కొరియన్ స్టార్ పార్క్ ‘కెప్టెన్ మార్వెల్ 2’ షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటాడట! ఆయన చేరికతో హాలీవుడ్ సూపర్ హీరో మూవీకి కొరియన్ ఆడియన్స్ లో ఎక్స్ ట్రా క్రేజ్ ఏర్పడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు…