NTV Telugu Site icon

kollywood : తమిళ స్టార్ హీరో శింబు సరసన టాలీవుడ్ క్యూటి

Str 49

Str 49

టాలీవుడ్ యంగ్ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ లోను సత్తా చాటుతుంది. రెండు భాషల ఇండస్ట్రీలలో ఈ భామకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆ కుర్ర హీరోయిన్ ఎవరో కాదు మీనాక్షి చౌదరి, ఇచట వాహనములు నిలపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి తక్కువ కాలంలో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ సుపర్ స్టార్ మహేశ్ బాబు తో గుంటూరు కారం లో మెప్పించింది. ఇక విక్టరీ వెంకీ అనిల్ రావిపూడి సినిమాలోను, విశ్వక్ సేన్ మెకానిక్ రాకి లోను మీనాక్షినే కథనాయికగా నటిస్తోంది.

Also Read : Vettaiyan : రూ. 400 కోట్లలో సూపర్ స్టార్.. తలైవా మాస్..

అటు తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ సినిమా G.O.A.T లోను మెరిసింది. తాజగా మీనాక్షి తమిళ్ లో మరో స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. మానాడు, పాతు తలా వంటి సూపర్ హిట్ సినిమాల అందించిన శింబు లేటెస్ట్ ఓ సినిమాను ప్రకటించారు. గతంలో జెట్ స్పీడ్ లో సినిమాలు చేసిన శింబు ఇటీవల కాలంలో ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న తగ్ లైఫ్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే శింబు సోలో హీరోగా అశ్వత్ మరిముత్తు సినిమాను ప్రకటించాడు. శింబు సినీ కెరీర్ లో 49వ సినిమాగా రానుంది ఈ చిత్రం. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ని హీరోయిన్ గా ఎంపిక అయిందట. త్వరలోనే అధికారక ప్రకటన రానుంది. ఇలా తెలుగు తమిళ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుకుంది మీనాక్షి.

Show comments