కోలీవుడ్‌లో టూ స్టార్ కిడ్స్ డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఒకరేమో మ్యారేజ్ లైఫ్ ఎంటరయ్యాక యాక్టింగ్ కెరీర్ నుండి ఫిల్మ్ మేకింగ్ పై ఫోకస్ చేస్తే మరొకరు టీనేజ్ వయసులోనే మెగా ఫోన్ పట్టి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఏది చేసినా డిఫరెంటే. ఒక వైపు హీరోయిన్‌గానూ ఫ్రూవ్ చేసుకుంటూ.. మరో వైపు విలన్ రోల్స్‌లోనూ హడలెత్తించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. హీరోలకే టఫ్ ఫైట్ ఇచ్చింది వరూ.. ఇప్పుడు మరో స్టెప్ తీసుకోబోతోంది. మెగా ఫోన్ పట్టబోతోంది వరలక్ష్మీ. దోస డైరీస్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సరస్వతి అనే ఫిల్మ్ ఎనౌన్స్ చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తోంది.
Also Read : Madharaasi : శివకార్తికేయన్ ‘మదరాసి’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఛేంజ్.. ఎప్పుడంటే?
వరలక్ష్మి 40 ప్లస్‌లో మెగా ఫోన్‌పై మక్కువ పెంచుకుంటే, టీనేజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సూర్య తనయ దియా సూర్య. ఓ వైపు పేరెంట్స్ సూర్య, జ్యోతిక స్టార్ హీరో, హీరోయిన్స్ గా క్రేజ్ తెచ్చుకుంటే పేరెంట్స్ నటనా వారసత్వాన్ని కాదని డైరెక్టర్ గా రాణించాలని మెగా ఫోన్ పట్టింది దియా. ఈ 17 ఏళ్ల అమ్మాయి ‘లీడింగ్ లైట్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసింది. ఈ షార్ట్ ఫిల్మ్‌ను 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించారు. ప్రస్తుతం ఈ చిట్టి సినిమా ఆస్కార్ క్వాలిఫయింగ్ కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో రీజెన్స్ థియేటర్లలో ప్రదర్శితమౌతోంది. ఆస్కార్ క్వాలిఫై అయితే డైరెక్టర్ గా సూర్య కూతురు సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే. అటు వరలక్ష్మి, ఇటు దియా డైరెక్టర్స్ గా మరిన్ని సినిమాలు చేయాలని ఆశిద్దాం.
