Madharaasi : ‘మదరాసి’ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిందిగా.. ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అయింది. అమరన్ వంటి సూపర్ హిట్ తర్వాత శివకార్తికేయన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అలాగే దర్బార్, సికిందర్ వంటి బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల తర్వాత మురుగుదాస్ చేసిన ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా అటు శివ కార్తికేయన్ కు ఇటు మురుగదాస్ కు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది.
Also Read : Devara : దేవర 2 లో తమిళ స్టార్ హీరో.. NTR బెస్ట్ ఫ్రెండ్ ఫిక్స్?
Also Read
భారీ అంచనాలతో వచ్చిన మదరాసి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్ తప్ప కథ, కథనాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇటు తెలుగులోను అదే పేరుతో వచ్చిన మదరాసి ఇక్కడ కూడా ప్లాప్ అయింది. తమిళనాడు మాత్రం పర్లేదు అనే స్థాయిలో వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కేవలం రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టి శివకార్తీకేయన్ కెరీర్ లో మరొక ప్లాప్ గా మిగిలింది. కాగా ఇప్పడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. థియేటర్ లో ప్లాప్ అవడంతో కాస్త ఎర్లీగా అక్టోబరు 1న అనగా ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసింది. తెలుగు, తమిళ్ తో పాటు పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు అవుతోంది మదరాసి. మరి థియేటర్ లో ఓ మోస్తరుగా ఆడిన మదరాసి ఓటీటీలో ఏ మేరకు వ్యూస్ రాబడుతుందో.
తాజావార్తలు
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!