టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ధనుష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ ఇప్పటికే స్ట్రయిట్ తెలుగు సినిమాలలో నటించేశారు. విజయ్ ఆంటోని సైతం తెలుగులో తన చిత్రాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని స్ట్రయిట్ తెలుగు సినిమాలో తప్పకుండా నటిస్తానని చెబుతున్నాడు. ఇక ఇటీవల విజయ్ తో తెలుగు సినిమా తీయబోతున్నట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగు సినిమాలో నటించడానికి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. నిజానికి చాలా కాలం తమిళచిత్రసీమకే పరిమితం అయిన ధనుష్ ఆ మధ్య హిందీ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత ఆంగ్ల చిత్రంలో నటించాడు. ఇప్పుడు ఓ అమెరికన్ మూవీలోనూ నటిస్తున్నాడు. ఆ రకంగా చూసినప్పుడు ధనుష్ దక్షిణాది భాషల్లో తమిళం తర్వాత నటిస్తున్నది తెలుగులోనే అని చెప్పాలి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, ఓ పాపులర్ దర్శకుడితో ఈ సినిమాను నిర్మించబోతోందట. రెండు మూడు భాషల్లో నిర్మితం కాబోతున్న ఈ మూవీలో ఓ సీనియర్ హీరో కూడా నటించబోతున్నాడట. తెలుగులోనూ ఇటీవల ధనుష్ నటించిన సినిమాలకు ఆదరణ లభిస్తుండటం, వరల్డ్ వైడ్ అతనికి విశేషంగా అభిమానులు ఉండటంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ కు క్రేజ్ వచ్చే ఆస్కారం ఉంది. చిత్రం ఏమంటే… ఈ మూవీ కథ గురించి, సాంకేతిక నిపుణుల గురించి తెలిసిన ఓ తెలుగు స్టార్ హీరో తానే నటిస్తానంటూ దర్శకనిర్మాతలకు హింట్ ఇస్తున్నాడట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!