Kollywood : సూర్య కోసం వెనక్కు తగ్గిన కుట్టి మక్కల్ సేతుపతి
- చివరి నిమిషంలో వెనక్కు తగ్గిన సేతుపతి సూర్య
- సెన్సార్ బోర్డ్ వల్ల సినిమా వాయిదా పడిన ఫీనిక్స్
- నెక్ట్ రిలీజ్ డేట్ ప్రకటించని యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ రియల్ వర్సటైల్ యాక్టర్ సూర్య నటించి కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 10 థౌజండ్ స్క్రీన్లపై గ్రాండియర్‌గా మూవీ రిలీజ్ అయ్యింది. అయితే కంగువా రిలీజ్ విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. తెలుగు సరే.. సొంత గడ్డ నుండే సమస్యలు ఎదురయ్యాయి. అమరన్ సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్లడంతో.. కంగువాకు థియేటర్ల కేటాయింపుల విషయంలో కాస్తంత తర్జన భర్జన జరిగింది. ఇదే కాదు.. మరో మూవీ కూడా అడ్డుగా మారింది అనుకుంటుండగా.. అనూహ్యంగా వెనక్కు తగ్గింది. ఇంతకు ఏంటా మూవీ.? సూర్యను ఢీ కొట్టేందుకు రెడీ అయిన యంగ్ హీరో ఎవరు..?
Also Read : Pushpa -2 : పుష్ప -2 ట్రైలర్ పై టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఏమన్నారంటే..?
Also Read
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- S Janaki: "ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు.." ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
- S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
మక్కల్ సేతుపతి విజయ్ కొడుకు సూర్య హీరోగా ఫీనిక్స్ విహాన్ అనే మూవీతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సినిమా కూడా నవంబర్ 14నే వస్తుందని ఎనౌన్స్ మెంట్ చేయడంతో పాటు ప్రమోషన్లు షురూ చేసింది యూనిట్. బిగ్ సూర్యను ఢీ కొట్టేందుకు లిటిల్ సూర్య వస్తున్నాడని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఫీనిక్స్ మూవీ రేసు నుండి తప్పుకుంది. దీనికి రీజన్ సెన్సార్ ఎఫెక్ట్ అని తెలుస్తోంది. ఫీనిక్స్ మూవీ కోసం సెన్సార్ బోర్డ్ కొన్ని కట్స్ సిఫార్సు చేయడంతో విడుదల తేదీని వాయిదా వేసుకుంది యూనిట్. అయితే లిటిల్ సూర్య వెనక్కు తగ్గడం అతడికే కలిసొస్తుందని అంటున్నారు కోలీవుడ్ సినీ విశ్లేషకులు. కంగువా మేనియా ముందు ఫీనిక్స్ ఆడియన్స్‌కు కనిపించి ఉండేది కాదని, దీని వల్ల సినిమా కలెక్షన్సే కాదు.. చోటా సూర్య కెరీర్ పై కూడా ఎఫెక్ట్ ఉండేదని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు వెనక్కు తగ్గడం అంతా నీమంచికే జరిగిందంటున్నారు. విజయ్ సేతుపతి కొడుకు సూర్య సినిమా పై కోలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.
తాజావార్తలు
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్‌చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
-
S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!