బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ప్రజంట్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాల్లో ‘భైరవం’ ఇంకా ‘టైసన్ నాయుడు’ చిత్రాల షూటింగ్ దాదాపు ఫినిషింగ్‌కి రాగా. ఇక ఈ సినిమాలు కాకుండా సాయి శ్రీనివాస్ కెరీర్ తన 11వ సినిమా కూడా రాబోతుంది. దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ ‘#BSS11’ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక గ్రిప్పింగ్ హర్రర్-మిస్టరీ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా గురించి..
Also Read: Navina Bole : ప్రాజెక్ట్‌కోసం పిలిచి.. బట్టలు విప్పి చూపించమన్నాడు
తాజాగా మేకర్స్ ఇప్పుడు అఫీషియల్‌గా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ‘#BSS11’ ప్రాజెక్ట్ కి ‘కిష్కింధపురి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఎక్సయిటింగ్ ఎక్స్ ప్రెషన్స్‌తో కనిపిస్తున్నారు. చేతుల్లో జ్వాలలు పట్టుకుని, బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ ఇద్దరు అడవిలో ఏదో వెతుకుతున్నట్లు కనిపించారు. బ్యాక్ డ్రాప్‌లో ఒక బంగ్లా కనిపింయడం థ్రిల్లింగ్ వైబ్‌ని తిసుకొచ్చింది. మొత్తానికి టైటిల్, పోస్టర్ రెండూ మూవీ పై అంచనాలు పెంచగా, ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఏప్రిల్ 29న సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.