గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
Also Read:Jharkhand: రోజూ రైలులో ప్రయాణిస్తున్న కోతి.. కిటికీ పక్కన సీటులో కూర్చొని ఎక్కడికి వెళ్తుందో తెలుసా?
ఈ ఈవెంట్ లో హీరోయిన్ శ్రీల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా జర్నీ చాలా వండర్ ఫుల్ గా జరిగింది. రాధాకృష్ణ గారు చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఈ కథని చాలా అద్భుతంగా చెప్పారు. రవిచంద్రన్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. జెనీలియా గారితో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్ నిర్మాత సాయి గారు. చాలా ప్రేమతో ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. శివన్న గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. కిరీటితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. డాన్స్ పెర్ఫార్మెన్స్ లో ఒక వెపన్ గా అనిపించారు. వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడానికి కారణం దేవిశ్రీప్రసాద్ గారు. ఆయన ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. జూలై 18న ఈ సినిమా వస్తుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.’ అన్నారు.
