ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా ఎం. వీరభద్రం ‘కిరాతక’ చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఈ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని డాక్టర్ నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. పూర్ణ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ సినిమాలో దాసరి అరుణ్ కుమార్, దేవ్ గిల్ కీలక పాత్రలు పోషించబోతున్నారు. సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ దాదాపు పూర్తి చేసుకున్న ‘కిరాతక’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుండి మొదలు కాబోతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ‘చుట్టాలబ్బాయి’ తర్వాత ఆది సాయికుమార్, వీరభద్రం కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది.
Read Also : “డియర్ మేఘ” సాంగ్… సిద్ శ్రీరామ్ మరో క్లాసికల్ హిట్