టాలీవుడ్ రొమాంటిక్ కపుల్‌లో యంగ్ హీకో కిరణ్ అబ్బవరం-రహస్య కూడా ఒకరు. తాజాగా ఈ ఏడాది వారి పెళ్లి వార్షికోత్సవాన్ని హ్యాపీ గా జరుపుకున్నారు. అది కూడా రొమాంటిక్‌గా క్యాడిల్ లైట్ డిన్నర్ ఔటింగ్‌లో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించన ఫోటోలు రహస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇందులో వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత స్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు..
Also Read : Ramayana : వాళ్లకు నచ్చకపోతే రామాయణ మూవీ ఫ్లాప్ అయినట్లే: నిర్మాత
కిరణ్ తన భార్యకు ఒక చిన్న నోట్ కూడా రాసి ఇచ్చాడు. ఈ నోట్‌లో “నన్ను ఎంపిక చేసుకున్నందుకు థ్యాంక్స్. నా జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను. బాగా చూసుకుంటాను” అని చెప్పడం ఎంతో ఎమెషన్‌గా అనిపించింది. రహస్య తన పోస్ట్‌లో “పెళ్లి ముందు నేను చాలా భయపడ్డాను, నా గుండె దడదడ లాడింది. అతని నోట్ చూశాక ఆ క్షణం హాయిగా, ప్రశాంతంగా అనిపించింది. అంతే నమ్మకంతో ఆయన నన్ను చూసుకుంటున్నారు. ఒక అమ్మాయికి తన భర్త నుంచి ఇంతకంటే ఏం కావాలి’ అని పేర్కొన్నారు. ఈ ఆనందాన్ని వారు అభిమానులతో కూడా పంచుకోవడం చాలా బాగుంది. దీంతో కామెంట్లలో వీరి ప్రేమ, ఆప్యాయతను ప్రశంసిస్తూ, “ఇలా సింపుల్, హ్యాపీగా ఉండాలి”, “మనం కూడా ఇంతా ప్రేమతో ఉంటే బాగుంటుంది” వంటి కామెంట్లు చేస్తున్నారు. మరోసారి కిరణ్ అబ్బవరం, రహస్య ఈ చిన్న క్యూట్ మోమెంట్స్ ద్వారా అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
