NTV Telugu Site icon

kiran Abbavaram : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం

Love Reddy

Love Reddy

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి” . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.  “లవ్ రెడ్డి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

Also Read : Allu Arjun: కళ్ళు చెదిరే రేట్ కు పుష్ప – 2 ఉత్తరాంధ్ర రైట్స్..?

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ” ఒక ఫ్యామిలీ కష్టపడి చేసిన సినిమా కాబట్టి మీరంతా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడండి. కంటెంట్ నచ్చితే లవ్ రెడ్డి సినిమాను హార్ట్ ఫుల్ గా సపోర్ట్ చేయండి. నా వల్ల అయిన హెల్ప్ నేను చేస్తా. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తాను” అని మాట ఇచ్చాడు. నేడు ఆ మాటను నిజం చేస్తూ నైజాం లో GPR ముల్టీప్లెక్స్ లో నేడు సాయంత్రం 7.45 షో, వైజాగ్ – శ్రీ రామా థియేటర్ 6: 30 షో, తిరుపతి – కృష్ణ తేజ 6: 30 షో, విజయవాడ 6:30 షో ప్రేక్షకుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసారు. ఇచ్చిన మాట నిలబెట్టుక్కున్నా యంగ్ హీరోను నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.