NTV Telugu Site icon

Kiran Abbavaram : దీపావళి రేస్ లో కుర్ర హీరోకు పోటీగా ‘క ‘

Ka

Ka

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది యూనిట్.

Also Read : PVCU 3 : ‘మహాకాళి’గా రాబోతున్న ప్రశాంత్ వర్మ

ఇటీవల రిలీజైన ‘క’ మాస్ జాతర సాంగ్ తో సినిమా పై అంచనాలు పెంచింది. ‘క’ ను అక్టోబరు సెకండ్ వీక్ లో రిలీజ్ చేయాలనిం భావించారు. కానీ ప్యాచ్ వర్క్ కారణంగా వాయిదా వేశారు. తాజగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ విషయమై అధికారక ప్రకటన కూడా రానుంది. కిరణ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ లో రానుంది ‘క’. ఈ సినిమా కిరణ్ కెరీర్ లో బిగ్ హిట్ అవుతుందని టాక్. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను వంశీ నందిపాటి కొనుగోలు చేసారు. ఇదిలా ఉండగా దీపావళి కి టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ ఎం , మెకానిక్ రాకి’ రిలీజ్ ఇది వరకే ప్రకటించారు. అలాగే తమిళ డబ్బింగ్ సినిమా శివకార్తికేయన్ ‘ అమరన్’ నుండి పోటీ ఎదుర్కొనబోతుంది కిరణ్ అబ్బవరం ‘క’.

Show comments