విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “కింగ్డమ్” సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ యాక్షన్ డ్రామా, అభిమానులను మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచే రీతిలో వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా కేరళ రాష్ట్రంలో రూ.1 కోటి గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. నాన్ మలయాళ వెర్షన్ లో ఈ రేంజ్ వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా ‘కింగ్డమ్’ చరిత్ర సృష్టించింది. కేరళ ప్రేక్షకుల నుంచి ఈ స్థాయిలో స్పందన రావడం ఆశ్చర్యంగా ఉందని ఈ చిత్రం నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు.
ఒకవైపు దేశంలో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఈ చిత్రం, మరోవైపు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా ఉద్యమంగా నార్త్ అమెరికా, యూఎస్, గల్ఫ్ మార్కెట్లలో ‘కింగ్డమ్’కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫస్ట్ వీక్ ముగిసేలోపు ఈ సినిమా ₹100 కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని సినిమాల్లో సక్సెస్‌లు దూరంగా ఉన్న విజయ్ దేవరకొండకి ‘కింగ్డమ్’ ఒక మంచి సినిమాగా నిలిచింది. అలాగే, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కు ఇది మరో సూపర్ హిట్‌గా చేరింది.