Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, గురువారం నాడు, అంటే జూలై 31వ తేదీన, ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, సినిమాకి అమెరికా ప్రీమియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంతమంది అదిరిపోయింది అని అంటే, కొంతమంది మాత్రం ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్‌కి కంప్లైంట్స్ ఉన్నాయని అంటున్నారు. ఏదైతేనేం, మొత్తానికి సినిమా మాత్రం బాగానే వర్కౌట్ అయిందంటున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా నిర్మాణ సంస్థ. ఏకంగా మొదటి రోజు 39 కోట్ల గ్రాస్ కింగ్డమ్ సినిమా కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆంధ్ర తెలంగాణలో ఈ సినిమా విజయ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిందని అంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం లైగర్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయిందని అంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఏరియాలలో 50% రికవరీ ఫస్ట్ డే సాధించిందని నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ శ్రీలంకలో ఉన్న తన అన్నను వెతుక్కుంటూ వెళ్లిన లైన్‌తో ఈ సినిమా రాసుకున్నాడు గౌతం.