Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే ‘కిల్లర్’ కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!

Killer Jyothi

Killer Jyothi

టాలీవుడ్‌లో సై-ఫై సినిమాలు రావడం అరుదు. అయితే ఒక హాలీవుడ్ స్థాయి కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు పూర్వాజ్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘న్యూరోలింక్’ పేరుతో కృత్రిమ మేధస్సు (AI), బ్రెయిన్ చిప్స్ పై చేస్తున్న పరిశోధనల నేపథ్యంగా “కిల్లర్” సినిమా తెరకెక్కినట్లు ఆయన వెల్లడించారు. “ఎలాన్ మస్క్ ప్రస్తుతం మిషన్స్, జంతువుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అదే ప్రయోగాన్ని ఒక మనిషి మీద చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేదే మా సినిమా కాన్సెప్ట్” అని పూర్వాజ్ అసలు విషయాన్ని లీక్ చేశారు.

ఒక భారీ హాలీవుడ్ సై-ఫై పాయింట్‌ను తీసుకున్నప్పటికీ, దానికి మాస్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి ప్రతి సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఎంటర్టైనింగ్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాను టీమ్ సభ్యులు ఏకంగా క్రిస్టోఫర్ నోలన్ ‘ఒడిస్సీ’ లాంటి సినిమాలతో పోలుస్తున్నారని, సినిమా చూసి బయటకు వచ్చాక ప్రేక్షకులు కూడా ఆ ఫీల్ అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రక్తపాతం లేకుండా, మైండ్‌ను బ్లో చేసే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ఫీమేల్ సెంట్రిక్ మూవీ ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది.