NTV Telugu Site icon

Kichcha Sudeep : క్రిస్మస్ రేస్ లో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

Max

Max

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచుకున్నాడు. ఆ గుర్తింపుతో అయన నటించిన పలు సినిమాలో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సుదీప్ నటించిన విక్రాంత్ రాణా సినిమా తెలుగులోను మంచి కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా కిచ్చా సుదీప్  నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ “మ్యాక్స్”.తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు.

Also Read : Lyca Productions : ‘జాస‌న్ సంజ‌య్’ ఫస్ట్ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మ్యాక్స్ చిత్రాన్ని తెలుగులో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్  చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు.”మ్యాక్స్” చిత్రంలో  అర్జున్ మహాక్షయ్అ నే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.ఇక ఈ సినిమాలో కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ తో పాటు సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో క్రిస్మస్ రిలీజ్ కు చాలా సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. ఇప్పుడు వాటితో మాక్స్ వచ్చి చేరింది.

Show comments