Kiara Advani: ప్రతి రిలేషన్ మనకు.. ఏదో ఒక పాఠం నేర్పుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.. ఏం మాట్లాడినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ, తాజాగా తన కూతురి భవిష్యత్తు, డేటింగ్ సంస్కృతిపై చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ సందర్భంగా భవిష్యత్తులో తన కూతురు సరయా రిలేషన్షిప్స్ విషయంలో మీరెలా వ్యవహరిస్తారు అనే ప్రశ్న కియారాకు ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ..
‘నా కూతురికి మేము ఎలాంటి రూల్స్ పెట్టము. ఆమె ఒకరితోనే కాకుండా జీవితంలో ఎంతమందితోనైనా డేటింగ్ చేయొచ్చు, ఆఖరికి పెళ్లి చేసుకోకపోయినా మాకు ఎలాంటి అభ్యంతరం లేద. ఎందుకంటే ‘డేటింగ్ చేసిన ప్రతి ఒక్కరినీ పెళ్లి చేసుకోవాలనే నియమం లేదు. ఎదిగే క్రమంలో మనం పెట్టుకునే సంబంధాలు మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తాయి, ఒక మంచి మనిషిగా మనల్ని మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి, ఇందులో ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేస్తారు.. వాటి నుంచే నేర్చుకుంటారు. నా విషయంలో కూడా అలాగే జరిగింది, చివరికి సిద్ధార్థ్ రూపంలో నాకు సరైన వ్యక్తి దొరికాడు’ అని కియారా చెప్పుకొచ్చారు. కూతురి విషయంలో తాము ఒక స్నేహితురాలిగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. కానీ
Also Read
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
కియారా అద్వానీ మాట్లాడిన ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. “సెలబ్రిటీలు పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో మాట్లాడేటప్పుడు భారతీయ సంస్కృతిని గుర్తుంచుకుని, కొంచెం బాధ్యతగా మాట్లాడాలి” అని కొందరు హితవు పలుకుతుండగా.. “సమాజానికి ఇలాంటి పశ్చాత్య సంస్కృతిని (Western Culture) అలవాటు చేయకండి” అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కియారా కేవలం ఒక తల్లిగా తన కూతురి వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాత్రమే మాట్లాడిందని ఆమె అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!