ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ లు కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం కూడా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం.. తర్వాత పిలల్లు.. మళ్లీ యధావిధిగా సినిమాలు. ప్రతి ఒక్కరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఒకరు. ఈ ఏడాది జూలైలో పాప ‘సరాయా’కు జన్మనిచ్చిన ఆమె.. తాజాగా మాతృత్వం తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చేసిందో వివరించింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ సరసన నటించిన ‘వార్ 2’ సినిమాలో కియారా బికినీ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సీన్ చూసినప్పుడు తనకు కలిగిన ఫీలింగ్‌ను కియారా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.
Also Read : Champion : ఓటీటీ డీల్ ముగించుకున్న ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
‘ ‘వార్ 2’లోని ‘ఆవన్ జావన్’ పాటలో బికినీలో కనిపించడం కోసం కియారా ఎంతో కష్టపడి నా శరీరాన్ని ఫిట్‌గా మార్చుకున్నాను. కానీ సినిమా విడుదల సమయానికి డెలివరీ కావడంతో శరీరం పూర్తిగా మారిపోయింది. ఆ బికినీ షాట్ కోసం చాలా క్రమశిక్షణతో కష్టపడ్డాను. కానీ డెలివరీ అయ్యాక నా శరీరాన్ని చూసుకుంటే చాలా కొత్తగా అనిపించింది. మొదట మళ్ళీ పాత షేప్‌లోకి రావాలని అనుకున్నాను కానీ, వెంటనే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. పర్ఫెక్ట్ బాడీ కంటే ఒక ప్రాణాన్ని భూమిపైకి తెచ్చిన నా శరీరం ఎంత గొప్పదో అర్థమైంది. ఇప్పుడు నేను ఏ సైజులో ఉన్నా, ఎలా ఉన్నా నా శరీరాన్ని నేను గౌరవిస్తాను’ అంటూ ఎమోషనల్ అయ్యింది.
ప్రస్తుతం తన కూతురు సరాయాతో గడుపుతున్న ప్రతి నిమిషం తనకు ఎంతో ప్రత్యేకం అని కియారా చెప్పుకొచ్చింది. పాప చేసే చిలిపి పనులు, నవ్వులు చూస్తుంటే తన అలసట అంతా మాయం అయిపోతుందని అంటోంది. ఈ ఏడాది ‘గేమ్ ఛేంజర్’, ‘వార్ 2’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కియారా, త్వరలో కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కనిపించబోతోంది. మాతృత్వం తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె ఈ సందర్భంగా తెలిపింది.
