తల్లి అతిలోక సుందరి శ్రీదేవి! అక్క ఆధునిక సుందరి జాన్వీ! మరిక అంతర్జాల సుందరి ఖుషీ ఆగుతుందా చెప్పండి? రెచ్చిపోయింది! తన పేరుకు తగ్గట్టుగా, కుర్రాళ్లను బికినీతో ‘ఖుషీ’ చేసింది ఖుషీ కపూర్! అమెరికాలో యాక్టింగ్ కోర్స్ చదువుతోన్న మిస్ జూనియర్ కపూర్ ఖాళీగా ఉండటం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో భారీగా ఫ్యాన్స్ ని పొగేస్తోంది. అందులో భాగంగానే మన లాంగ్ లెగ్ లేడీ తన సొగసులు అప్పుడప్పుడూ నెటిజన్స్ కు వడ్డిస్తూనే ఉంటుంది. తాజాగా లావెండర్ కలర్ టూ పీస్ సెట్ ధరించి ధగధగలాడింది. బికినీ వేసిన కపూర్ బ్యూటీ జూమ్ చేసుకున్నోడికి జూమ్ చేసుకున్నంత… అన్నట్టుగా హై డెఫినీషన్, హై ఓల్టేజ్ ఫోటోలు పోస్ట్ చేసింది!
Also Read : “ఆర్ఆర్ఆర్” టీం రెడీ…!
శ్రేదేవి ఇద్దరు కూతుళ్లలో చిన్నదైన ఖుషీ కపూర్ పొడగరే! జాన్వీ కంటే ఖుషీ టాల్ ఉంటుంది. ఆ కారణంగా ఆమె టూ పీస్ లుక్స్ మరింత హాట్ గా అదరిపోయాయి. పొడుగు కాళ్ల సొగసులు సెగలు రేపాయి. అయితే, ఖుషీ ‘పూల్ డే’ అంటూ ఇన్ స్టాలో షేర్ చేసిన లవ్లీ పిక్స్ లో కొసమెరుపు ఏంటంటే… ఆమె బుజ్జి కుక్క పిల్ల కూడా హొయలు పోయింది కెమెరాను చూసి!