NTV Telugu Site icon

Khushbu Sundar : ఇతనే నా హీరో.. అతడి మాస్ ను ఎవరు టచ్ చేయలేరు..

Untitled Design (10)

Untitled Design (10)

జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివల దేవర బాక్సాఫీస్ దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు. RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన  పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో విలన్ గా మెప్పించారు. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన దేవర బాక్సాఫీస్ వద్ద విధ్వంసం చేస్తోంది. ఇక ఈ చిత్రంలోని తారక్ నటనను పలువురు సెలెబ్రిటీలో కొనియాడుతున్నారు.

Also Read : Dhoom Series : ధూమ్ – 4లో నటించే స్వీట్ దొంగ ఎవరంటే..?

ఇదిలా ఉండగా తమిళ నటి కుష్బూ సుందర్ ఒక విడుదలైన ఒక రోజు తర్వాత సినిమా చూస్తూ ” ఇతనే నా హీరో, సెమ్మ మాస్.. నేను దీన్ని ఎలా మిస్ చేయగలను, దేవరతో అతను ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం చూస్తున్నాను’ అని ఆమె వ్యక్తిగత X ఖాతాలో ట్వీట్ చేసింది. కుష్బూ ట్వీట్ కు తారక్ బదులిస్తూ ” హాహా.. థాంక్యూ మేడమ్, దేవర మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ను నందమూరి ఫాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. కాగా జూనియర్ ఎన్టీయార్ అంటే తనకు చాలా ఇష్టం, తారక్ నటన ఓ అద్భుతం అని గతంలో ఓ ఇంటర్వ్యూ లో తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే తారక్ ప్రతి పుట్టిన రోజునాడు కుష్బూ తెలియజేసే విషెష్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. కాగా దేవర వరల్డ్ వైడ్ గా సువర్ హిట్ టాక్ తో  బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకువెళ్తుంది.