Site icon NTV Telugu

డేంజర్ తో డేటింగ్… “ఖిలాడీ” టైటిల్ సాంగ్

Khiladi

Khiladi

దీపావళి పండుగ సందర్భంగా రవితేజ నటించిన తాజా చిత్రం “ఖిలాడీ” నుంచి అప్డేట్స్ ప్రకటించారు. “ఖిలాడీ” మేకర్స్ తాజాగా దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. డిఎస్పీ తన ట్రేడ్‌మార్క్ పెప్పీ స్టైల్‌లో కంపోజ్ చేసిన “ఖిలాడీ” టైటిల్ సాంగ్ రవితేజ పాత్ర స్వభావాన్ని వివరిస్తుంది. విలాసవంతమైన సెట్‌లు, విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో విజువల్స్ మాత్రమే కాకుండా రవితేజ ఎనర్జిటిక్ మూవ్‌లు, యశ్వంత్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన హైలైట్.

Read Also : వీడియో : “అఖండ” టైటిల్ సాంగ్ టీజర్

“ఖిలాడీ” టైటిల్ సాంగ్‌ను యువ గీత రచయిత శ్రీ మణి రాశారు. ప్రతిభావంతులైన గాయకుడు, సంగీతకారుడు రామ్ మిరియాల పాడారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. “ఖిలాడీ”లో యంగ్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్‌తో కలిసి కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Exit mobile version