ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ ఉన్న సినిమాలలో ‘కెజిఎఫ్’ సీక్వెల్ కూడా ఒకటి. కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్’ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించటంతో సీక్వెల్ నిర్మాణంలో ఉంది. ఈ సీక్వెల్ నిర్మాణం పూర్తి అయింది. షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. జులై 16న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘కేజీఎఫ్2’ మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడానికి మరి కొంత సమయం పట్టనుంది. అక్టోబర్ కి అన్నీ సర్దుబాటు అవుతాయని భావిస్తున్నారు. దీంతో పలువురు దర్శకనిర్మాతలు దసరా సీజన్ పై కన్నేశారు. వారి బాటలోనే ‘కేజీఎఫ్ 2’ ను కూడా దసరా కు విడుదల చేయాలనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ సీక్వెల్ కూడా ‘కెజిఎఫ్’లా అందరినీ అలరిస్తుందని భావిద్దాం.