NTV Telugu Site icon

“అధీరా”కు “కేజీఎఫ్” టీం బర్త్ డే విషెస్

KGF Chapter 2 team wishes Sanjay Dutt on his birthday

యశ్, శ్రీనిధి శెట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా “కేజీఎఫ్ : చాప్టర్ 2” ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా హైప్ ఉన్న చిత్రాలలో ఒకటి. యష్ ‘రాకీ’గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లు కూడా నటించడం అంచనాలను పెంచేసింది. సంజయ్ దత్ సినిమాలో విలన్ “అధీరా” పాత్రను పోషిస్తుండడం ప్రధాన హైలైట్. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా “కేజీఎఫ్ : చాప్టర్ 2” మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోంబాలే ఫిల్మ్స్ అధికారిక ట్విట్టర్ లో “యుద్ధం పురోగతి కోసం ఉద్దేశించబడింది. రాబందులు కూడా నాతో అంగీకరిస్తాయి” – అధీరా, హ్యాపీ బర్త్ డే సంజయ్ దత్” అంటూ ఈ పోస్టర్ పై రాసుకొచ్చారు.

Read Also : “మహా సముద్రం” మోషన్ పోస్టర్

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “కేజీఎఫ్ 2″లో మాళవిక అవినాష్, ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, రావు రమేష్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన “కేజీఎఫ్ : చాప్టర్ 2” టీజర్ యూట్యూబ్‌లో 200 మిలియన్ల వీక్షణలను చేరుకుంది. “కేజీఎఫ్ 2″ను త్వరలోనే విడుదల చేయనున్నారు. మేకర్స్ దేశవ్యాప్తంగా సినిమా హాళ్ళు రీఓపెన్ కావడం కోసమే ఎదురు చూస్తున్నారు.