NTV Telugu Site icon

Kethika : సమంత, శ్రీలీల బాటలో మరో హీరోయిన్

Sharma

Sharma

ఒకప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలంటే హీరోయిన్స్ వెనకడుగు వేసేవారు. ఎందుకంటే ఇలాంటి సాంగ్ చేస్తే.. రిపీట్‌గా ఇలాంటి ఛాన్సులే వస్తాయన్న రూమర్ ఉంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తే.. ఆ క్రేజే వేరు. జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా ఊపందుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ రేంజ్‌కు వెళ్లారీద్దరు. తాజాగా ‘పుష్ప2’ శ్రీలీల కూబా ఐటం సాంగ్స్‌తో ఊపేశింది. ఇక ఇప్పుడు వీరి బాటలోనే పోతానంటోంది మరో భామ.

also Read: Bollywood : యాడ్ ద్వారా చిక్కులో పడిన స్టార్ హీరోలు

ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే హాట్ బ్యూటీ కేతిక శర్మ. ఇప్పటి వరకు గ్లామర్‌తో కట్టిపడేసిన ఈ బ్యూటి ఫస్ట్ టైం తన అందచందాలతో కుర్రకారు మతి పొగొట్టేయబోతుంది. నితిన్- శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘రాబిన్ హుడ్‌’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. బ్రో తర్వాత తెలుగులో కనిపించకుండా పోయిన కేతిక.. ఇప్పుడు ఈ ఐటెం సాంగ్‌తో తళుక్కున మెరవనుంది. కాగా ఈ సర్ప్రైజ్ సాంగ్ మార్చి 10న విడుదల చేయనున్నారు మేకర్స్. దీంతో పాటు తమిళంలో మిస్టర్ కేకే ఫేం రాజేష్ ఎం సెల్వన్ దర్శకత్వంలో మూవీకి కమిటయ్యింది కేతిక. ఇవి తప్ప మరో ఛాన్స్ లేదు. రీసెంట్లీ విజయ్ 69 అనే హిందీ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీకి.. అదిదా సర్ప్రైజ్ సాంగ్ తిరిగి బాలీవుడ్, టాలీవుడ్ లో సర్పైజ్ కెరీర్ ఇస్తుందేమో చూడాలి.