కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేసారు. మలయాళ చిత్రసీమలో మహిళలు లైంగిక వేధింపుల నుండి వేతన వ్యత్యాసాల వరకు ఎదుర్కొంటున్న 17 సమస్యల పరిస్థితులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు బహిర్గతం కావడం మలయాళ చిత్ర పరిశ్రమలో రాజకీయ దుమారానికి దారితీసింది. చిత్ర పరిశ్రమలోని మహిళల నుంచి వెల్లువల ఫిర్యాదులు రావడంతో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆ పదవి నుండి వైదొలిగారు సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్.
Also Read: Nani : సరిపోదా శనివారం ప్రమోషనల్ సాంగ్ లు అద్భుత స్పందన..
రంజిత్ బాలకృష్ణన్ నిర్మాత మాత్రమే కాదు మళయాలంలో స్టార్ దర్శకులలో ఒకరు. ఇటీవల ఈ దర్శకుడిపై బెంగాలీ నటి శ్రీలేఖ పలు సంచలన ఆరోపణలు చేసింది. 2009లో మలయాళంలో సినిమా ఆడిషన్ కోసం రంజిత్ బాలకృష్ణ తనను హోటల్ రూమ్ కి పిలిచారు, ఆ సమయంలో ఆ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. పలేరి మాణిక్యం సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని వాపోయింది. ఈ చిత్రానికి రంజిత్ దర్శకత్వం వహించారు.నేను ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో రంజిత్ బాలకృష్ణన్ తన చేతి గాజులని తాకారని ఆ తర్వాత మెడపై చేయి వేశారని ఆమె ఆరోపించింది. కాగా ఈ వ్యాఖ్యలను రంజిత్ కొట్టిపారేసాడు. శ్రీలేఖ ఆ అపాత్రకు సరిపోదని తీసుకోలేదని తెలిపాడు దర్శకుడు. మలయాళంలో గతేడాది విడుదలైన నయట్టు చిత్రానికి దర్శకుడే ఈ రంజిత్ బాలకృష్ణన్. ప్రస్తుతం ఈ వివాదం కేరళ ఇండస్ట్రీలో తీవ్ర చర్చినీయాంశం అయింది.