Keerthy Suresh: షూటింగ్‌లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!

Keerthy Suresh

Keerthy Suresh

Keerthy Suresh: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్, తాజాగా తోటి నటుల ప్రవర్తనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన కొత్త వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్ల ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన కెరీర్ స్టార్టింగ్‌లో షూటింగ్ సెట్స్‌లో కొందరు హీరోలు, తోటి నటుల వల్ల తాను ఎంతలా ఇబ్బంది పడిందో ఓపెన్‌గా చెప్పేసింది.

గతంలో తాను పనిచేసిన కొందరు కో-స్టార్స్ బిహేవియర్ చూసి ఒకానొక దశలో తనపై తనకే అనుమానం వచ్చిందని కీర్తి చెప్పుకొచ్చింది. “వాళ్లు ప్రవర్తించే తీరు చూసి షూటింగ్ సెట్స్‌లో చాలా నెర్వస్ అయిపోయేదాన్ని. నా యాక్టింగ్‌లోనే ఏదో లోపం ఉందేమో, నేనే తప్పు చేస్తున్నానేమో అనుకుని తెగ భయపడేదాన్ని” అని గుర్తుచేసుకుంది. అయితే కొన్నాళ్లకు అసలు విషయం అర్థమైందని చెప్పింది. “తప్పు నా దగ్గర లేదు.. అసలు సమస్య వాళ్లదే అని తర్వాతే తెలిసింది. వాళ్లకున్న భయం, ఇన్ సెక్యూరిటీని నా మీద చూపించేవారు. నన్ను తక్కువ చేసి మాట్లాడి నా కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలని చూశారు” అంటూ కుండబద్దలు కొట్టేసింది. సాధారణంగా ఇలాంటి విషయాలు ఎవరూ బయటకు చెప్పరు. కానీ కీర్తి సురేష్ ఇంత డైరెక్ట్‌గా తోటి నటుల తీరును ఎండగట్టడంతో.. ఇంతకీ ఆమెను అంతలా టార్గెట్ చేసిన ఆ నటులు ఎవరబ్బా అంటూ సినీ జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు.