Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthy Suresh: పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్, ఇప్పుడు గేర్ మార్చి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. కేవలం రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, మొన్నటికి మొన్న నాని ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్‌తో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ, అటు ‘డోరతీ’లో కాసేపే కనిపించినా ఇంపాక్ట్ చూపించింది. ఇక త్వరలోనే ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌లో నెవర్ బిఫోర్ లేడీ గ్యాంగ్‌స్టర్ అవతారంలో అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో పలకరించబోతోంది. అయితే ఇవన్నీ ఒకెత్తయితే.. నవంబర్ 20న థియేటర్లలోకి రాబోతున్న ఆమె తాజా చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’ చుట్టూ ఇప్పుడు టాలీవుడ్లో ఓ సరికొత్త వివాదం రాజుకుంది.
ఈ సినిమా టీజర్ బయటకు వచ్చాక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. సినిమా జులైలోనే రావాల్సి ఉండగా నవంబర్‌కు వాయిదా పడింది. ఈ లేట్ రిలీజ్‌పై వచ్చే ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చేలా టీజర్లో పోకిరి సినిమాలోని ఫేమస్ డైలాగ్ “ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా!” అనే పవర్ఫుల్ డైలాగ్‌ను తెలుగు టీజర్లో వాడారు. అయితే మాట మహేష్ బాబుది పెట్టి, విజువల్స్‌లో మాత్రం కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ సీన్‌ను చూపించడం మనోళ్లకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. మాట ఆయనది వాడినప్పుడు మహేష్‌ను ఎందుకు చూపించలేదంటూ సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ మేకర్స్‌పై గుర్రుమంటున్నారు. టైటిల్‌తో పాటు సినిమా మొత్తం తమిళ వాసనలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి.
Also Read
దర్శకుడు మిస్కిన్ కీలక పాత్రలో, కీర్తి సురేష్ లాయర్‌గా నటిస్తున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు బాక్సాఫీస్ వద్ద అంత ఈజీగా దారి దొరికేలా లేదు. నవంబర్ 20న అటు తెలుగు, ఇటు తమిళంలో ఇద్దరు క్రేజీ హీరోలతో కీర్తి నేరుగా తలపడాల్సి వస్తోంది. ధనుష్ నటిస్తున్న ‘ఓం’, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాలు కూడా సరిగ్గా అదే రోజున థియేటర్లలోకి దిగుతున్నాయి. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో ఈ ఇద్దరు స్టార్ల చిత్రాల నుంచి భారీ పోటీని తట్టుకుని కీర్తి సురేష్ తన ‘సావిత్రి’తో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi : కాక తర్వాత చిరు నెక్స్ట్ ఎవరితో?
-
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!