Site icon NTV Telugu

Keerthy Suresh : హీరోలతో సమానంగా మాకు రెమ్యూనరేషన్.. ఇవ్వాలి !

Keerthi Suresh

Keerthi Suresh

మలయాళ చిత్రాలతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ కీర్తి సురేష్.. తక్కువ సమయంలోనే దక్షిణ భారత సినీ పరిశ్రమలో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన రాగా. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, సుహాస్ కాటికాపరి పాత్రలో, కీర్తి గ్రామాధికారిణిగా ఈ సినిమాలో కనిపించనుంది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో నిమగ్నమైంది కీర్తి.

Also Read : Rashmika : అలాంటి పాత్రలు చేయను.. నేషనల్ క్రష్ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్

ఈ సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ పారితోషికం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.. ‘నా విషయంలో పారితోషికాన్ని‌కి చివరి ప్రాధాన్యత ఇస్తాను. మొదట కథే నాకు చాలా ముఖ్యం. వైవిధ్యమైన పాత్రలు పోషించడ‌మే నా లక్ష్యం. హీరోహీరోయిన్ల‌కు సమాన రెమ్యూనరేషన్ విషయం పై చర్చలు జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే ఒక హీరో కోసం ప్రేక్షకులు ఎలా అయితే థియేటర్ కు వస్తున్నారో, అదే స్థాయిలో ఓ హీరోయిన్ కోసం కూడా ప్రేక్షకులు వస్తుంటే కచ్చితంగా నాయికకు హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వొచ్చు’ అని చెప్పుకొచ్చింది.

Exit mobile version