కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టటానికి రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కీర్తి సురేష్, అశోక్ సెల్వన్ చేరారు. వీరిద్దరూ కోవిడ్ -19 వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకున్నారు. ప్రస్తుతం కీర్తి, అశోక్ వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో రౌండ్లు వేస్తున్నాయి. కీర్తి సురేష్ ఇటీవల కోవిడ్ -19 వ్యాక్సినేషన్ కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంది. తాజాగా మాస్క్ ధరించి వ్యాక్సిన్ వేయించుకున్న పిక్ ను ఇన్స్టా లో షేర్ చేసుకున్న కీర్తి ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. మరోవైపు నటుడు అశోక్ సెల్వన్ కోవిడ్ -19 టీకాను మే 22న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకున్నారు. తనకు చాలా సందేహాలు ఉన్నాయని, అయితే డాక్టర్లు, నిపుణులతో మాట్లాడి ఆ సందేహాలను నివృత్తి చేసుకున్నాను అని, ఆ తరువాత టీకా తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు.
A post shared by Ashok Selvan (@ashokselvan)