NTV Telugu Site icon

Keerthi Suresh : ఆ సినిమాలో చాలా భయపడుతూ నటించాను..

Keerthisuresh

Keerthisuresh

మార్పు సహజమే.. హీరోయిన్‌లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉంటారు. తప్పదు అది వారి ప్రొఫెషనల్. కానీ  అభిమానులు వాటిని జీర్ణించుకోవడం కొంచెం కష్టం. ప్రజంట్ కీర్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్‌లో కీర్తి సురేష్ ఒకరు. ఆమె ముందు నుంచి ఎలాంటి స్కిన్ షో చేయకుండా, సాఫ్ట్‌గా కనిపించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ పూర్తిగా మారిపొయింది. రోజు రోజుకు మరింత హాట్‌గా మారిపోతుంది. స్కిన్ షోకి అసలు ఏమాత్రం తగ్గడం లేదు. షోషల్ మీడియాలో హాట్ షో డోస్ పెంచుకుంటూ వస్తుంటుంది. ఇలా మొత్తానికి సరైన హిట్స్ లేకపోయే సరికి కీర్తి సురేష్ కూడా ఓ రేంజ్ లో తన బోల్డ్ షో తో హాట్ టాపిక్‌గా మారుతూ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన చిన్నతనం గురించి, అలాగే సినీ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది..

Also Read : Abhinaya : పెళ్లిపీటలెక్కబోతున్న స్టార్ నటి

ఇంట్లో అల్లరి చేస్తారా? అని ప్రశ్నించడంతో.. ‘ చాలా అల్లరి చేసేదాన్ని. నాకు చిన్నప్పుడు రూపాయి నాణేలు నోట్లో పెట్టుకోవడం అలవాటుగా ఉండేది. అలా రెండు సార్లు కాయిన్లు మింగేసా. ఆ అలవాటు మానేయడానికి చాలా సమయం పట్టింది. చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా తిడితే వాళ్లు వాల రూమ్‌కు వెళ్లినప్పుడు బయట గడియ పెట్టేదాని. ఈ విధంగా అమ్మను చాలాసార్లు ఏడిపించాను. ఇప్పటికీ కూడా కోపం వస్తే అలాగే చేస్తా. నా జీవితాన్ని మార్చేసిన మూవీ ‘మహానటి’ . ఆ పాత్ర నాకు పెద్ద ఛాలెంజ్‌లా అనిపించింది. సావిత్రి గారిలా నటించడానికి నాకు చాలా భయం వేసింది. అంతే భయంతో నటించాను’ అని ఆమె తెలిపింది.