కయాదు లోహార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో శ్రీ విష్ణు పక్కన అల్లూరి అనే సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమా వర్కౌట్ కాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో నటించగా, అది తెలుగులో కూడా రిలీజ్ అయి రెండు చోట్ల బ్లాక్ బస్టర్ అయింది.
Also Read:Preity Mukhundhan: కన్నప్ప సైడ్ చేస్తే.. ప్రీతి మొదలెట్టింది!
ఇప్పుడు ఆమె స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చేందుకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి సినిమాలు ఎంచుకుంటుంది. ఇప్పటికే ఆమె నాని హీరోగా నటిస్తున్న పారడైజ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పటివరకు బయటకు చెప్పడం లేదు కానీ దాదాపుగా ఆమె ఎంపిక కరారు అయినట్లే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో నటిస్తోంది.
Also Read:Lokesh Kanagaraj: అందుకే పూజా హెగ్డే’కి ఆ పేరు!
నిజానికి ఈ సినిమాలో నాని తల్లి పాత్ర కూడా వేశ్య పాత్ర కాగా, వేశ్యవాటికలో పుట్టి పెరిగిన కుర్రాడే కథానాయకుడిగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కయాదు పాత్ర కూడా ప్రాస్టిట్యూట్ పాత్ర అని తెలియడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఒకరకంగా ఇది ఆమెకు కెరియర్ మొదట్లోనే ఒక బోల్డ్ పాత్ర అని చెప్పొచ్చు. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఆమెకు ఫ్యూచర్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చినా అనుమానం లేదు. మరో పక్క ఆమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తుంది.
