తెలుగు ప్రేక్షకులకు అల్లూరి సినిమాతో పరిచయం అయిన అస్సామీ అందాల కయాదు లోహర్.. ఈ ఏడాది కోలీవుడ్‌లో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఆమె కెరీర్ కు చాలా ప్లెస్ అయ్యింది. దీంతో ఈ అమ్మడుకు వరుస అఫర్‌లు వస్తున్నాయి. తాజాగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఒక కామెడీ చిత్రం చేస్తున్నట్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే
Also Read : Mahima Nambiyar : “ఇదే నా లాస్ట్ వార్నింగ్” – యూట్యూబ్ ఛానల్స్‌పై హీరోయిన్ ఫైర్
కయాదు లోహర్ మాట్లాడుతూ.. “నేను అనుదీప్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాను. ఈ మూవీ పూర్తిగా కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. చాలా డైలాగ్స్ షూటింగ్ స్పాట్‌లో ఆలోచించి రాసినవే. ప్రతీ సీన్ కొత్తగా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కామెడీ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే నేను అనుదీప్ సార్‌తో ఓ సినిమా చేస్తున్నా. కామెడీ చాలా కష్టమని తెలుసుకున్నా. ఎందుకంటే కామెడికి భాష కూడా ముఖ్యమే.అస్సామీ భాషలో కామెడీ చేయడం సులభం, కానీ ఇతర భాషల్లో అది చాలా కష్టంగా ఉంటుంది. మీకు భాష తెలిసినప్పుడు దాని అర్థమేంటో. ఆ సంస్కృతి ఏంటో మీకు తెలుస్తుంది. అప్పుడు కామెడీ చేయడం ఈజీ అవుతుంది’ అని తెలిపింది.