Site icon NTV Telugu

Kayadu Lohar: కాయదు కమిటెడా? నమ్మలేని కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ!

Kayadu Lohar

Kayadu Lohar, Kayadu Lohar Marriage, Kayadu Lohar Single,

నిజానికి, తెలుగు ప్రేక్షకులకు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ చిత్రంతోనే పరిచయమైంది హాట్ బ్యూటీ కాయదు లోహర్. కానీ, ఈ సినిమా అమ్మడికి ఏ మాత్రం గుర్తింపు తీసుకురాలేదు. అయితే, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో కాయదు అందానికి ఫిదా అయ్యారు కుర్రకారు. ఇక్కడి నుంచి టాలీవుడ్‌లో యమా డిమాండ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలె విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ ఆమెను నిరాశ పరిచినప్పటికీ.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ ఆశలు పెట్టుకుంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కాయదు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అలాగే.. ప్రస్తుతం తమిళ్, మళయాళంలో కలిపి అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది.

Also Read: Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!

ఇదిలా ఉంటే, తాజాగా కాయదు లోహర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన సినీ కెరీర్‌పై దృష్టి పెడుతున్నప్పటికీ, పర్సనల్ లైఫ్ గురించి కూడా తన మనసులో ఉన్న మాటను చెప్పేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా.. తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి స్పందించింది కాయదు. మీరు కమిటెడా అంటే, “నేను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానంటూ’ చెప్పుకొచ్చింది. అలాగే, తనకు పెళ్లి కూడా చేసుకోవాలని ఉందని చెప్పింది. ఇక, సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. అమ్మడు “సింగిల్” అని చెప్పడం నమ్మశక్యంగా లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ కాయదు లోహర్ సింగిలేనంటారా?

Also Read: NTR-Neel: ఎన్టీఆర్ అలా, రుక్మిణి ఇలా.. వర్కౌట్ అవుతుందా?

 

Exit mobile version