Site icon NTV Telugu

Kavya Thapar : తిరిగి ఫామ్ లోకి వచ్చిన హాట్ బ్యూటీ..

Kavya Thapar

Kavya Thapar

కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసి, మంచి గుర్తింపు సంపాదించుకున్న కనుమరుగైపోతారు. అలాంటి వారిలో కావ్య థాప‌ర్ ఒకరు. మోడ‌లింగ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన కావ్య థాప‌ర్ ఆ త‌ర్వాత హీరోయిన్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో మొద‌టి ‘ఈ మాయ పేరేమిటో’ మూవీతో వచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. తర్వాత తెలుగుతో పాటూ త‌మిళంలో కూడా సినిమాలు చేస్తూ వ‌చ్చింది అయినప్పటికి కావ్యకి పెద్ద‌గా క‌లిసిరాలేదు. అలా రెండేళ్ల ముందు వ‌ర‌కు ఏడాదికి ఒక సినిమా చేసుకుంటూ వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ గ‌తేడాది ఏకంగా నాలుగు సినిమాలు చేసింది. మాస్ మ‌హారాజ ర‌వితేజ‌తో ‘ఈగ‌ల్’, సందీప్ కిష‌న్ తో ‘ఊరు పేరు భైర‌వ‌కోన‌’, రామ్ పోతినేని తో ‘డ‌బుల్ ఇస్మార్ట్’, గోపీచంద్ తో క‌లిసి ‘విశ్వం’ సినిమా చేసింది. కానీ ఈ నాలుగు చిత్రాలో ‘ఊరు పేరు భైర‌వ‌కోన‌’ ఒకటే మంచి హిట్ అందుకుంది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న కావ్య థాపర్ సమాచారం ప్రకారం తిరిగి ఫామ్ లోకి చ్చింది..

Also Read: Birth control pills : పిల్లలు కాకుండా గర్భ నిరోధక మాత్రలు వాడే వారికి బిగ్ అలర్ట్..

తాజాగా ఓ సినిమాకు క‌మిటైన‌ట్టు టాక్ వినిపిస్తుంది. ధ‌మాకా డైరెక్టర్ త్రినాథ‌రావు న‌క్కిన చేయ‌నున్న అప్‌క‌మింగ్ ప్రాజెక్టులో హీరోయిన్‌గా కావ్య ఎంపికైందట. హ‌వీష్ హీరోగా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ సినిమాతో అయినా కావ్యకు అనుకున్న ఫ‌లితాన్నిస్తుందేమో చూడాలి. ప్రజంట్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ తట్టుకోలేక కూడా చాలా మంది హీరోయిన్లు వెనకడుగు వేస్తున్నారు. కానీ కావ్య మాత్రం అని తట్టుకుంటూ ముందుకు సాగుతుంది.

Exit mobile version