ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. జూన్ 26 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయన్ని చెన్నైకి తరలించారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన హెల్త్ పరిస్థితిపై రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. ఆయన కంటికి కూడా బలమైన గాయాలు అవ్వడంతో చూపు కోల్పోయాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా కత్తి మహేష్ హెల్త్ బులిటెన్ ప్రకారం ఆయన ఔటాఫ్ డేంజర్ అని సమాచారం. కాకపోతే బలమైన గాయాలు తాకడంతో కత్తి కోలుకోవడానికి మాత్రం చాలా కాలం పడుతుందని తెలుస్తోంది.