NTV Telugu Site icon

Actress Kasturi : అరెస్టుకు ముందు వీడియో రికార్డు చేసిన కస్తూరి

Kasturi (2)

Kasturi (2)

తమిళ సీనీ నటి కస్తూరి తెలుగు వారినుద్దేశిస్తూ అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు వచ్చారు. ఇప్పుడు వారంతా తమది తమిళజాతి అంటున్నారు. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరు ఎవరు‌‌ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నటికస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు సమన్లు ​​జారీ చేసేందుకు ప్రయత్నించగా, ఆమె ఇంటికి తాళం వేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటాన్ని గుర్తించారు.దాంతో కేసులకు బయపడి నటి కస్తూరి ‌ఎవరికికనిపించకుండా పోయారు.

Also Read : Sreeleela : పుష్ప -2 ట్రైలర్ కే హైలెట్ గా శ్రీలీల

మరోవైపు తెలుగు వారిపై తన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పిన ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు నమోదు చేశారంటూ నటి కస్తూరి వెల్లడిస్తూ ముందస్తూ బెయిల్ కోరింది పరారీలో ఉన్న నటి కస్తూరి. బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో పోలీసులు తీవ్రంగా గాలించి హైదరాబాద్ పుప్పాల గూడ BRC అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కస్తూరి ఉందన్న సమాచారం తెలుసుకుని, నార్సింగ్ పోలీసుల సహకారంతో కస్తూరి ని అరెస్ట్ చేయగా కోర్టు పోలీసుల కస్టడీకి అప్పగించింది. ఇదిలా ఉండగా కస్తూరి అరెస్ట్ కాక మునుపు ఓ వీడియో ను రికార్డు చేసి ఉంచింది. కస్తూరి ఆ విడియోలో  ‘నేను ఎక్కడికి పారిపోలేదు, షూటింగ్‌ కోసం హైదరాబాద్ కు వచ్చాను, మా ఇంట్లోనే ఉన్నాను, షూటింగ్ అయిపోయిన వెంటనే పోలీసులకు సహకరించాను, నాకు ఎలాంటి భయము లేదు, ఎగ్మోర్ పోలీసులు తనను తీసుకెళ్లడానికి వచ్చారని వారికి పూర్తిగా సహకారం అందించాను’  అని వీడియో రికార్డ్ చేసి తన లాయర్ ద్వారా విడుదల చేసింది.

Show comments