తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు సూర్య. ఈ దఫా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రురల్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సూర్య 45ను నిర్మిస్తోంది.
కాగా నేడు సూర్య బర్త్ డే కానుకగా ‘కరుప్పు’ నుండి టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. కొబ్బరి కాయ కొట్టి కర్పూరం వెలిగించే దేవుడిని కాదు అని మొదలైన టీజర్ ను అవుట్ అండ్ అవుట్ యాక్షన్ గా కట్ చేసారు. నా పేరు సూర్య.. కానీ నాకు ఇంకో పేరు ఉంది.. వంటి డైలాగ్ లు సూపర్బ్ గా ఉన్నాయి. కానీ రొటీన్ తమిళ్ కమర్షియల్ సినిమాలానే ఉండేలా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో సూర్య డ్యూల్ రోల్ లో కనిపించనున్నాడు. తొలిసారి స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్న ఆర్జే బాలాజీ టేకింగ్ బాగుంది. ఇక కోలీవుడ్ యాంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ బాగుంది. ఈ బర్త్ డే నాటికి సూర్య 50 ఇయర్స్ లో అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. మొత్తానికి సూర్య ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా ఆర్జే బాలాజీ రెడీ చేసిన కరుప్పు టీజర్ మెప్పించింది. తమిళ టైటిల్ ‘కరుప్పు’ ను తెలుగులో అదే పేరుతో తీసుకువస్తున్నారు.
Also Read : HHVM : హరిహర వీరమల్లు పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే షాకింగ్ ట్వీట్.. ఇదేం ట్విస్ట్
