యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ తో జత కట్టబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి సినిమాను నిర్మించబోతున్నారు. దీనికి ‘సత్యనారాయణ్ కీ కథ’ అనే పేరు పెట్టారు. ‘ఈ సినిమాలో ఉన్నవారంతా నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్శన్స్ అని, తాను మాత్రమే అవార్డు అందుకోని వాడిన’ని కార్తీక్ ఆర్యన్ చెబుతున్నాడు. ఈ ప్రేమగాథ తన మనసుకు ఎంతో దగ్గరైనదని అంటున్నాడు. ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ను కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Read Also : బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!
‘కార్తీక్ ఇప్పటికే పలు ప్రేమకథా చిత్రాలలో నటించినా, ఇది అతనికి ఓ కొత్త కథా చిత్రం అవుతుందని, అతని రాకతో ఈ ప్రాజెక్ట్ లో కొత్త ఎనర్జీ జత కలిసింద’ని నిర్మాత సాజిద్ నడియాద్ వాలా అన్నారు. నమః పిక్చర్స్ కు చెందిన షరీన్ మంత్రి కేడియా మాట్లాడుతూ, ‘ఇదో యూనిక్ లవ్ స్టోరీ. ప్రేమలోని శక్తిని తెలియచేసే కథ ఇది. కార్తీక్ లోని అమాయకత్వం ప్రతి ఒక్కరి హృదయాలనూ గెలుచుకుంటుంది” అని చెప్పారు. ఇక కార్తీక్ ఆర్యన్ సినిమాల విషయానికి వస్తే, అతను నటించిన ‘థమాకా’ ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ‘భూల్ బులయ్యా 2’ సెట్స్ పై ఉంది. దీని తర్వాత ‘అల వైకుంఠపురములో’ రీమేక్ సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. అలానే హన్స్ లాల్ మెహతా నిజ సంఘటనల ఆధారంగా తీయబోతున్న సినిమాలో కార్తీక్ ఆర్యన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటించబోతున్నాడు.