Site icon NTV Telugu

పునీత్ పార్థివదేహాన్ని ముద్దాడిన సీఎం బొమ్మై

puneeth

puneeth

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో మరి కాసేపట్లో సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రాజ్ కుమార్ స్టూడియోలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక అంత్యక్రియలు నిర్వహించే ముందు బొమ్మై పునీత్ ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి కడసారి వీడ్కోలు పలికారు. రాజ్ కుమార్ స్టూడియోలో తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగుతుండగా అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో అనుకోని సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు.

Read Also : పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం

Exit mobile version