Site icon NTV Telugu

కరీనా, సైఫ్ దంపతుల రెండవ కొడుకు పేరేంటో తెలుసా ?

Kareena Kapoor Khan and Saif Ali Khan name their second son 'Jeh'

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తమ చిన్న కుమారుడికి పేరు పెట్టేశారు. ఈ విషయాన్ని కరీనా తండ్రి రణధీర్ కపూర్ వెల్లడించారు. మనవడి పేరు, ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించారు. ఫిబ్రవరి 2021లో తమ రెండవ కొడుకుకు స్వాగతం పలికిన కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ అతనికి ‘జెహ్’ (Jeh) అని పేరు పెట్టారు. ‘జెహ్’ అనేది లాటిన్ పదం. దీని అర్థం “బ్లూ క్రెస్టెడ్ బర్డ్”. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అభిమానులు ప్రేమగా ‘సైఫీనా’ అని పిలుచుకునే ఈ జంటకు నాలుగేళ్ల కుమారుడు తైమూర్ అలీ ఖాన్ కూడా ఉన్నారు.

Read Also : రిలీజ్ ముందే సూపర్ హీరో మూవీ లీక్…!

కరీనా, సైఫ్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తమ రెండవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. అప్పటి నుండి ఈ జంట తమ కొడుకు పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఫోటోలు కేసుల షేర్ చేయలేదు. ఈ సంవత్సరం మదర్స్ డే సందర్భంగా ఆమె తన రెండవ కుమారుడి మొదటి ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె పెద్ద కొడుకు తైమూర్ తన తమ్ముడిని పట్టుకొని కనిపించాడు. కాగా “కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నన్సీ బైబిల్” పేరుతో కరీనా తన తొలి పుస్తకం ముఖచిత్రాన్ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తైమూర్ ఖాన్ కు బాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Exit mobile version