రిలీజ్ ముందే సూపర్ హీరో మూవీ లీక్…!

సాధారణంగా సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజు లేదా ఆ తరువాత పైరసి బారిన పడతాయి. కానీ తాజాగా ఓ సూపర్ హీరో మూవీ మాత్రం ఇంకా విడుదల కాకుండానే ఫుల్ క్లారిటీతో లీక్ అయ్యింది. 2020 నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ హీరో చిత్రాలలో స్కార్లెట్ జోహన్సన్ నటించిన మార్వెల్ మూవీ ‘బ్లాక్ విడో’ ఒకటి, యూఎస్ఏతో పాటు ఇతర దేశాలలో జూలై 9న విడుదలైంది. స్కార్లెట్ జోహన్సన్, ఫ్లోరెన్స్ నటించిన ఈ చిత్రం వివిధ టొరెంట్ సైట్లలో లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఇంకా ఇండియాలో విడుదల కాలేదు. కరోనా మహమ్మారి కారణంగా డిస్నీ+ లో అక్టోబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ అంతలోనే ఇలా లీక్ అవ్వడంతో “బ్లాక్ విడో” అభిమానులు షాక్ అవుతున్నారు.

Read Also : రివ్యూ : క్రష్ (జీ 5)

అయితే ఆన్‌లైన్‌లో లీక్ అయిన తొలి చిత్రం ఇదొక్కటే కాదు. ఇంతకుముందు ‘కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా, ముంబై సాగా, ది ప్రీస్ట్, ఎక్స్‌ట్రాక్షన్, ది లయన్ కింగ్, ఫ్రోజెన్ 2 వంటి బాలీవుడ్ చిత్రాలు పైరసీ సైట్ల బారిన పడ్డాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-