Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్

Student Of The Year

Student Of The Year

వన్స్ ఆపాన్ ఎ టైం సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు గాంచిన కరణ్ జోహార్ ఇప్పుడు వరుస డిజాస్టర్స్‌తో సతమతమౌతున్నాడు. బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్‌ను పెంచి పోషించే బాధ్యతను తీసుకున్న కరణ్ జోహార్.. ఆ మూవీస్ ఫ్లాప్ అవుతున్నా వారిని విడిచిపెట్టడం లేదు. జాన్వీ, అనన్య పాండే ఆస్థాన హీరోయిన్స్‌గా మారిపోగా.. నెక్ట్స్ మరో స్టార్ కిడ్‌తో సరికొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు. షనయాతో సిరీస్ సిద్ధం చేస్తున్నాడు.

కరణ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్‌గా తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఈ మూవీతోనే ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్దార్థ్‌ మల్హోత్రాను ఇంట్రడ్యూస్ అయ్యారు. పార్ట్2 దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించిన కరణ్.. నిర్మాతగా కొనసాగాడు. అనన్య పాండే, తారా సుతారియాకు ఈ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. నెక్ట్స్ ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు కరణ్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3ని సినిమాగా కాకుండా సిరీస్‌గా ప్లాన్ చేస్తున్నాడట కరణ్. ఇందులో షనయా కపూర్ లీడ్ రోల్‌లో నటిస్తుందట. ఇప్పటికే షనయా బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేసింది. కానీ సక్సెస్ టేస్ట్ చేయలేదు. యాక్చువల్లీ షనయాను తొలుత బేధక్ మూవీతో కరణ్ ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంది.. కానీ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. దీంతో ఆమెను డిజిటల్ తెరపైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడట కరణ్. ఈ ప్రాజెక్ట్‌కు రీమా మాయ దర్శకత్వం వహిస్తుందని సమాచారం. ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్‌పై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కునుందని తెలుస్తోంది.