2022లో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన ‘కాంతార’ సినిమా రిలీజ్ అయి ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఇప్పుడు కంటిన్యూయేషన్ అన్నట్లుగా ‘కాంతార: చాప్టర్ 1’ రిలీజ్ చేశారు మేకర్స్. వాస్తవానికి ఇది కంటిన్యూయేషన్ కాదు, ఒక రకంగా ప్రీక్వెల్. అంటే, ‘కాంతార’ సినిమా కన్నా ముందు జరిగిన కథని ‘కాంతార: చాప్టర్ 1’లో చూపించారు.
Also Read :Meesala Pilla: ప్రోమోకే ఇలా అయిపోతే ఎలా.. అసలు మ్యాటర్ అబీ బాకీ హై!
అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘కాంతార’ సినిమాలో నటించిన కొంతమంది నటులు ‘కాంతార: చాప్టర్ 1’లో కూడా నటించారు. అంటే, ‘కాంతార’లో ఉన్న వారు గతంలోనే రాజుల సమయంలో కూడా ఉన్నట్లుగా చూపించారు అన్నమాట. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అలా ‘కాంతార’లో నటించి మళ్లీ ‘కాంతార: చాప్టర్ 1’లో కూడా ఎవరెవరు నటించారు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా, వారు ‘కాంతార’లో నటించిన పాత్ర పేరు, తరువాత ‘కాంతార: చాప్టర్ 1’లో కనిపించిన పాత్ర పేరు మీ ముందుకు తీసుకొస్తున్నాం.
Also Read :Naga Chaitanya : మెసేజ్‌లతో పుట్టిన ప్రేమ.. నాగ చైతన్య రివీల్ చేసిన సీక్రెట్
రిషబ్ శెట్టి- ‘కాంతార: చాప్టర్ 1’లో బెర్మే, ‘కాంతార’లో(ద్విపాత్రాభినయం కాడుబెట్టు శివ, శివ తండ్రి)
ప్రమోద్ శెట్టి- ‘కాంతార: చాప్టర్ 1’లో కులశేఖర మంత్రి భోగేంద్రగా, ‘కాంతార’లో సుధాకర పాత్ర
నవీన్ డి. పాడిల్- ‘కాంతార: చాప్టర్ 1’లో బూబా, ‘కాంతార’లో న్యాయవాది
ప్రకాష్ తుమినాడ్- ‘కాంతార: చాప్టర్ 1’లో చెన్నా, ‘కాంతార’లో రాంప
అచ్యుత్ కుమార్- ‘కాంతార: చాప్టర్ 1’లో అరబిక్ వ్యాపారి దలాల్‌గా(అతిథి పాత్ర), ‘కాంతార’లో దేవేంద్ర సుత్తూరు
ప్రగతి రిషబ్ శెట్టి – ‘కాంతార: చాప్టర్ 1’లో( అతిథి పాత్ర )’కాంతార’లో రాజు భార్య
